సరికొత్త రికార్డు సృష్టించిన విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా'!
Add ap7am to your home Screen

సరికొత్త రికార్డు సృష్టించిన విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా'!

  • ఆంధ్రా, సీడెడ్ లను మించిన నైజాం కలెక్షన్లు
  • నైజాంలో రూ. 7.92 కోట్లు, ఏపీలో రూ. 7.52 కోట్లు
  • అరుదైన రికార్డు సాధించిన 'టాక్సీవాలా'
టాలీవుడ్ అగ్రహీరోలు ఎవరూ సాధించని ఓ అరుదైన రికార్డును సాధించి చూపించాడు విజయ్ దేవరకొండ. ఆయన నటించిన తాజా చిత్రం 'టాక్సీవాలా' ఈ రికార్డును సాధించింది. అదేంటో తెలుసుకోవాలంటే...

తెలుగు చిత్రాల మార్కెట్ విషయంలో వైశాల్యం పరంగా నైజాం పెద్దదిగా ఉన్నా, ఆంధ్రా, సీడెడ్ (రాయలసీమ) నుంచి అధికంగా వసూళ్లు వస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణలో హైదరాబాద్ ను మినహాయిస్తే, మిగతా ప్రాంతం మొత్తం ఏరియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కన్నా, కృష్ణా - గుంటూరు లేదా ఉభయ గోదావరి జిల్లాల రైట్స్ కు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటివరకూ టాలీవుడ్ లో ఆంధ్రా, సీడెడ్ కలెక్షన్లకు మించి నైజాంలో ఏ సినిమా కూడా అధిక వసూళ్లను రాబట్టలేదు. ఇప్పుడు 'టాక్సీవాలా' దాన్ని సాధించి చూపించింది.

'టాక్సీవాలా' చిత్రం ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాల్లో 7.52 కోట్లను వసూలు చేయగా, నైజాంలో రూ. 7.92 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓ తెలుగు సినిమా ఇటువంటి రికార్డును సృష్టించడం ఇదే తొలిసారని అంటున్నారు టాలీవుడ్ విశ్లేషకులు. అలా టాప్ హీరోలు సాధించలేని రికార్డును విజయ్ చేసి చూపించాడన్నమాట.
Andhra
Seeded
Naizam
Vijay Devarakonda
Taxiwala

More Telugu News