KTR: కేటీఆర్ అసలు పేరు కల్వకుంట్ల తారకరామారావు కాదు..!: మధు యాష్కీ

  • కేటీఆర్ అసలు పేరు అజయ్ రావు
  • కేసీఆర్ కుటుంబానిది దరిద్రపుగొట్టు చరిత్ర
  • ఆస్తులను కాపాడుకోవడానికే మోదీతో కుమ్మక్కయ్యారు
తెలంగాణ మంత్రి కేటీఆర్ అసలు పేరు కల్వకుంట్ల తారకరామారావు కాదని... ఆయన అసలు పేరు అజయ్ రావు అని కాంగ్రెస్ నేత మధు యాష్కీ తెలిపారు. కేసీఆర్ బతుకేందో తెలంగాణ ప్రజలకు తెలుసని... కేసీఆర్ కుటుంబానిది దరిద్రపుగొట్టు చరిత్ర అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దుబాయ్ శేఖర్... శేఖర్ మామగా ఆ తర్వాత కేసీఆర్ గా ఎదిగారని చెప్పారు. ఆస్తులను కాపాడుకోవడానికే ప్రధాని మోదీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని విమర్శించారు. ప్రధాని అయ్యే అవకాశాన్ని సోనియాగాంధీ మూడు సార్లు వదులుకున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియాగాంధీనే అని అన్నారు. కల్వకుంట్ల అక్రమార్జనను ప్రతి రోజు వివరిస్తానని చెప్పారు.
KTR
original name
Madhu Yaskhi
congress
TRS

More Telugu News