డైలాగ్స్ ఎలా చెప్పాలనేది కమల్ నుంచి నేర్చుకున్నాను: రజనీకాంత్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డైలాగ్స్ ఎలా చెప్పాలనేది కమల్ నుంచి నేర్చుకున్నాను: రజనీకాంత్

  • కమల్ తో ఎలాంటి విరోధం లేదు 
  • నాకు కమల్ మంచి మిత్రుడు 
  • మా మధ్య గొడవలు పెట్టాలని చూశారు   
తమిళ చిత్రపరిశ్రమకి రజనీకాంత్ .. కమలహాసన్ రెండు కళ్ల వంటి వారు. తమిళ చిత్ర పరిశ్రమకి సంబంధించినంత వరకూ ఇద్దరూ తిరుగులేని కథానాయకులే. ఇటీవల రజనీ .. కమల్ మధ్య మనస్పర్థలు వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. తాజా ఇంటర్వ్యూలో రజనీకి ఈ విషయాన్ని గురించిన ప్రశ్న ఎదురైంది.

అందుకు రజనీ స్పందిస్తూ .. " నాకూ .. కమల్ కి మధ్య ఎలాంటి విరోధం లేదు .. మా మధ్య ఎలాంటి గొడవలూ లేవు. నిజం చెప్పాలంటే నాకు ఆయన మంచి మిత్రుడు. ఆయనకి .. నాకు మధ్య పోటీ ఉందనే విషయాన్ని కూడా నేను అంగీకరించను. ఇద్దరం కలిసి ఒకేసారి కెరియర్ ను ప్రారంభించాము. కెరియర్ తొలినాళ్లలో డైలాగ్స్ ఎలా చెప్పాలనేది ఆయనని చూసే నేర్చుకున్నాను. ఇద్దరం ఎదుగుతూ వస్తుండటంతో మా మధ్య గొడవలు సృష్టించాలని చాలామంది ప్రయత్నించారు. కానీ ఈ విషయంలో ఇద్దరమూ జాగ్రత్తగా ఉండటం వలన అవతలివారి ప్రయత్నాలు ఫలించలేదు" అని చెప్పుకొచ్చారు.   
rajani
kamal

More Telugu News