ఎయిర్ పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు వేసింది వైఎస్ హయాంలోనే.. దీనిపైనా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు!: విజయసాయిరెడ్డి
- విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డును వైఎస్ వేశారు
- వాటిని తానే చేసినట్లు చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు
- ఫేస్ బుక్ లో స్పందించిన వైసీపీ నేత
అసలు ఈ ప్రాజెక్టుల గురించి ఏమీ తెలియని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందు చంద్రబాబు బీరాలు పోతున్నారని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు, ఔటర్ రింగ్ రోడ్డుకు జవహర్ లాల్ నెహ్రూ పేరు ఉన్నాయన్న విషయం కూడా రాహుల్ కి తెలియదన్నారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.