‘2.ఓ’ను ముందే హెచ్చరించినట్టుగా... లీక్ చేసిన 'తమిళ రాకర్స్'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘2.ఓ’ను ముందే హెచ్చరించినట్టుగా... లీక్ చేసిన 'తమిళ రాకర్స్'

  • లీక్ చేసి తీరుతామని తమిళ రాకర్స్ సవాల్
  • విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ
  • సోషల్ మీడియాలో పైరసీ లింక్స్
ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ‘2.ఓ’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రాన్ని లీక్ చేసి తీరుతామని గతంలోనే తమిళ రాకర్స్ అనే వెబ్‌సైట్ హెచ్చరించింది. చెప్పినట్టుగానే ఈ వెబ్‌సైట్ చిత్రాన్ని లీక్ చేసింది. ఈ సినిమా పైరసీ లింకులను తమిళరాకర్స్ వెబ్‌సైట్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. గత కొంతకాలంగా తమిళ రాకర్స్‌పై కోలీవుడ్ హీరో విశాల్ పోరాడుతున్నారు. అయినప్పటికీ చిత్రాల లీక్స్ మాత్రం ఆగట్లేదు.

‘2.ఓ’ చిత్రం విడుదలై కొన్ని గంటలు కూడా గడవక ముందే పైరసీ లింకులు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తుండటంతో చిత్రబృందం ఆందోళన వ్యక్తం చేస్తోంది. సినిమా ఓపెనింగ్స్ పరంగా అద్భుత వసూళ్లను సాధించినప్పటికీ పైరసీ ప్రభావాన్ని తట్టుకుని ఇకముందు నిలబడగలదా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సినిమాకు ప్రాణం గ్రాఫిక్సే కాబట్టి ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్‌లోనే చూసేందుకు ఇష్టపడతారు కాబట్టి పైరసీ ప్రభావం చిత్రంపై పెద్దగా ఉండదనే మరో వాదన కూడా వినిపిస్తోంది.
2.0 movie
Tamil Rockers
vishal
Social Media
Movie links

More Telugu News