'భారతీయుడు 2'లో వెన్నెల కిషోర్ కి చోటు?
- ఈ రోజే థియేటర్లకు వచ్చిన '2.ఓ'
- త్వరలో సెట్స్ పైకి 'భారతీయుడు 2'
- ముఖ్య పాత్రల్లో దుల్కర్ - శింబు
తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా జరిగేలా శంకర్ ప్లాన్ చేశాడని అంటున్నారు. ఇప్పటికే కమల్ లుక్ ను సెట్ చేసిన ఆయన, ముఖ్యమైన పాత్రలకి గాను దుల్కర్ సల్మాన్ .. శింబులను తీసుకున్నారు. ఈ సినిమాలో కమెడియన్ పాత్రకి కూడా చాలా ప్రాముఖ్యత ఉందని సమాచారం. ఈ పాత్రకి గాను ఆయన వెన్నెల కిషోర్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సినిమా అంతా ఈ పాత్ర కనిపిస్తుందట. ఈ సినిమాతో వెన్నెల కిశోర్ రేంజ్ మరింత పెరగబోతోందనే టాక్ బలంగా వినిపిస్తోంది.