kukatpalli: కూకట్‌పల్లిలో మరో వివాదం.. టీడీపీ, టీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య ఘర్షణ

షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రచారం సందర్భంగా ఆల్విన్‌ కాలనీలో ఇరువర్గాలు ఘర్షణ పడడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. గతంలోనూ నియోజక వర్గంలో టీడీపీ ప్రచారాన్ని అడ్డుకోవడంతో రెండువర్గాల మధ్య తోపులాట జరిగిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం తెలుగుదేశం నేతలు ప్రచారం నిర్వహిస్తుండగా స్థానిక కార్పొరేటర్‌ వెంకటేష్‌ గౌడ్‌  వారిని ప్రశ్నించేందుకు వెళ్లారు. దీంతో వెంకటేష్‌పై తెలుగుదేశం వర్గీయులు దాడికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, అనంతరం ఘర్షణ జరిగాయి. పోలీసుల రంగ ప్రవేశంతో వివాదం సద్దుమణిగింది.
Go Back to Shorts
kukatpalli
Telugudesam
TRS

More Telugu News