gottimukkala: చంద్రబాబుతో భేటీ అయిన కూకట్ పల్లి నేత గొట్టిముక్కల!

షార్ట్స్‌లో చూడండి
టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కూకట్ పల్లి నియోజకవర్గ ఇన్ ఛార్జి గొట్టిముక్కల పద్మారావు టీడీపీలో చేరారు. విజయవాడలో ఈరోజు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రేపటి నుంచి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని తరపున ప్రచారం నిర్వహించబోతున్నానని చెప్పారు.

కేసీఆర్ ను తన తండ్రిలా, టీఆర్ఎస్ ను సొంత ఇంటిలా భావించానని చెప్పారు. తనతో పాటు ఎంతోమందికి పార్టీలో అన్యాయం జరిగినా... మార్పు కోసం ఓపికగా ఎదురుచూశామని అన్నారు. తెలంగాణవాదాన్ని కేసీఆర్ పూర్తిగా మరిచిపోయారని విమర్శించారు. పార్టీ పక్కదారి పట్టిందని, ఇప్పట్లో గాడిలో పడే పరిస్థితి కూడా కనిపించడం లేదని చెప్పారు.
Go Back to Shorts
gottimukkala
TRS
kukatpalli
resign

More Telugu News