vijay devarakonda: 30 కోట్లకి చేరువలో 'టాక్సీవాలా'

షార్ట్స్‌లో చూడండి
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన 'టాక్సీవాలా' ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన రోజు నుంచి ఈ సినిమా వసూళ్ల పరంగా తన దూకుడును కొనసాగిస్తూనే వుంది. తొలి రోజునే 10.5 కోట్ల గ్రాస్ ను సాధించి ఆశ్చర్యపరిచిన ఈ సినిమా, రెండవ రోజు నుంచే లాభాల బాట పట్టింది. ప్రపంచవ్యాప్తంగా తొలివారంలోనే ఈ సినిమా 30 కోట్ల గ్రాస్ వసూళ్లకు చేరువైంది.

ముందుగా రష్ లీక్ అయినప్పటికీ ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 29వ తేదీన భారీస్థాయిలో '2.ఓ' విడుదలవుతోంది. అప్పటివరకూ 'టాక్సీవాలా' జోరు కొనసాగనుంది. '2.ఓ' థియేటర్లలోకి వచ్చేలోగా 'టాక్సీవాలా' 30 కోట్ల గ్రాస్ ను క్రాస్ చేస్తుందని చెప్పుకుంటున్నారు. మొత్తానికి విజయ్ దేవరకొండ మరో మారు తన సత్తా చాటాడంటూ అభిమానులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.         
Go Back to Shorts
vijay devarakonda
priyanka

More Telugu News