'అయ్యా' పాత్రలో అదరగొట్టేస్తోన్న విజయ్ సేతుపతి
- స్టార్ హీరో పాత్రలో విజయ్ సేతుపతి
- వయసు మళ్లిన వ్యక్తిగా కొత్త లుక్
- వచ్చేనెల 20వ తేదీన విడుదల
స్టార్ ఇమేజ్ ఉండగా .. సినిమాల నిర్మాణం మధ్యలో ఉండగా హఠాత్తుగా ఆయన నటన నుంచి తప్పుకుంటాడు. ఎక్కడ చూసినా ఈ విషయంపైనే చర్చ. ఆయన మాత్రం చాలా ఉదాసీనంగా మారిపోయి .. సాధారణ జీవితం గడుపుతుంటాడు. అందుకు కారణమేమిటనేదే సస్పెన్స్. ఈ సినిమాలో వయసు మళ్లిన వ్యక్తిగా విజయ్ సేతుపతి లుక్ ఆశ్చర్య చకితులను చేస్తోంది. మౌళి .. అర్చన కీలకపాత్రలు పోషిస్తోన్న ఈ సినిమా, వచ్చేనెల 20వ తేదీన విడుదల కానుంది.