చీర కట్టు కుదరక దీపిక ఇబ్బందులు... వేదికపైనే సరిచేసిన రణ్ వీర్!
- ఇటలీలో జరిగిన వివాహంతో ఒకటైన దీప్ - వీర్
- రిసెప్షన్ లో చీర సెట్ కాక దీపిక ఇబ్బందులు
- సరిచేసి బెస్ట్ హజ్బెండ్ అనిపించుకున్న రణ్ వీర్
తాను కట్టుకున్న చీర సరిగ్గా సెట్ కాక, దీపిక ఇబ్బంది పడుతుంటే, రణ్ వీర్ స్వయంగా చీరను సరిదిద్దాడు. ఈ ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. దీపిక చీరను సరిచేసిన రణ్ వీర్, బెస్ట్ హజ్బెండ్ అని నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. ఇక, ఈ రిసెప్షన్ కు వచ్చిన అతిథులకు దక్షిణ భారత సంప్రదాయ వంటకాలన్నీ వడ్డించారట. ఈ నెల 28న, వచ్చే నెల 1న ముంబైలో మరో రెండుసార్లు ఈ జంట రిసెప్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.