ntr: ఎన్టీఆర్ .. చరణ్ లతో తలపడే విలన్ గా స్టార్ హీరో?

షార్ట్స్‌లో చూడండి
ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా రాజమౌళి మల్టీ స్టారర్ మూవీ షూటింగ్ మొదలైపోయింది. ప్రధాన పాత్రల కాంబినేషన్లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఒక కథానాయికగా కీర్తి సురేశ్ పేరు వినిపిస్తోంది. ఎన్టీఆర్ .. చరణ్ ఇద్దరూ స్టార్ హీరోలే. తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరికీ కూడా ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. అలాంటి హీరోలతో ఈ సినిమాలో తలపడే విలన్ ఎవరై వుంటారా అనే విషయమే ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో కన్నడ స్టార్ హీరో 'యష్'పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల కాలంలో కన్నడ సినిమాల్లో 'యష్' స్టార్ స్టేటస్ ను అందుకున్నాడు. మంచి ఫిజిక్ .. విలక్షణమైన నటనతో  ఆయన అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఆయనను ఈ సినిమాలో విలన్ గా తీసుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ఒక టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.' యష్'తాజా చిత్రం 'కేజీఎఫ్' వచ్చేనెల 21వ తేదీన తెలుగులోనూ విడుదలకానుంది. 
Go Back to Shorts
ntr
charan

More Telugu News