రంగారెడ్డి జిల్లాలో 20 నామినేషన్ల తిరస్కరణ... జాబితాలో టీడీపీ, బీజేపీ అభ్యర్థులు!
రంగారెడ్డి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనున్న ఎన్నికలకు పోటీ పడేందుకు 20 మంది వేసిన నామినేషన్లను వివిధ రకాల కారణాలతో అధికారులు తిరస్కరించారు. ఈ జాబితాలో టీడీపీ, బీజేపీ అభ్యర్థులు కూడా ఉండటంతో కలకలం రేగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థినంటూ రెబల్ గా బరిలోకి దిగిన క్యామ మల్లేష్, టీడీపీ నుంచి నామినేషన్ వేసిన రొక్కం భీమ్ రెడ్డి, బీజేపీ నుంచి నామినేషన్ వేసిన గ్యార జగన్ ల పత్రాలు చెల్లబోవని అధికారులు తెలిపారు. ఫార్వార్డ్ బ్లాక్ తరఫున నామినేషన్ వేసి, బీ-ఫామ్ ఇవ్వని సామ రోహిత్ రెడ్డి నామినేషన్ ను కూడా తిరస్కరించారు. కాగా, అత్యధికంగా షాద్ నగర్ లో 7 నామినేషన్లను తిరస్కరించినట్టు అధికారులు తెలిపారు.