నాని దూకుడు మీదే ఉన్నాడు!
- క్రికెట్ నేపథ్యంలో సాగే కథ
- డిఫరెంట్ లుక్స్ తో నాని
- నెక్స్ట్ మూవీ ఇంద్రగంటితో
శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, రీసెంట్ గా ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే నిన్నటి నుంచి రెండవ షెడ్యూల్ ను మొదలు పెట్టారు. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో ప్లాన్ చేశారు. అనిరుథ్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని నాని భావిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన ఇంద్రగంటితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది.