vijay devarakonda: సక్సెస్ తెచ్చిన సంతోషంలో ప్రియాంక జవాల్కర్

షార్ట్స్‌లో చూడండి
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రూపొందిన 'టాక్సీ వాలా'.. ఈ నెల 17వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. తొలి రోజునే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. విడుదలకి కొన్ని రోజులముందే ఈ సినిమా రష్ లీక్ కావడంతో, రిజల్ట్ ఎలా ఉంటుందోనని ఈ సినిమా టీమ్ కలవరపాటుకు లోనైంది. కానీ ఈ సినిమాకి అన్ని ప్రాంతాలనుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో, ఈ సినిమా టీమ్ హ్యాపీగా ఫీలవుతోంది.

ఇక ఈ సినిమా ద్వారా కథానాయికగా పరిచయమైన ప్రియాంక జవాల్కర్ కూడా, రష్ లీక్ అయినప్పుడు డీలాపడిపోయింది. కానీ ఇప్పుడు వస్తోన్న రెస్పాన్స్ చూసి సంతోషంతో పొంగిపోతోంది. ఈ అమ్మాయి గ్లామర్ .. నటన చూసినవాళ్లు, మరిన్ని అవకాశాలను అందుకోవడం ఖాయమనే అంటున్నారు. తెలుగులో కొంతమంది దర్శక నిర్మాతలు అప్పుడే ఆమె డేట్స్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా సమాచారం.  
Go Back to Shorts
vijay devarakonda
priyanka

More Telugu News