‘ఆర్ఆర్ఆర్ షూట్ బిగిన్స్’ అంటూ ఫొటోను షేర్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్!
- నేడు ప్రారంభమైన షూటింగ్
- రాజమౌళి దర్శకత్వంతో మల్టీ స్టారర్
- 2020లో విడుదలకు సన్నాహాలు
‘ఆర్ఆర్ఆర్.. షూటింగ్ మొదలైంది’ అనే క్యాప్షన్ తో ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి తమకాళ్లను ఒకేచోట పెట్టి ఫొటో తీశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2020లో విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేసుకుంటున్నారు.