స్టోరీ లైన్ ఫిక్స్... రాజమౌళి తదుపరి చిత్రం మహేష్ బాబుతోనే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్టోరీ లైన్ ఫిక్స్... రాజమౌళి తదుపరి చిత్రం మహేష్ బాబుతోనే!

  • ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్'తో బిజీగా ఉన్న రాజమౌళి
  • పూర్తి కాగానే మహేష్ తో సినిమా
  • తెలుగు, హిందీ భాషల్లో ప్రాజక్ట్ 
ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న రాజమౌళి, తన తదుపరి చిత్రం గురించి కూడా ఓ నిర్ణయానికి వచ్చేశారట. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ఈ సినిమా ఉంటుందని టాలీవుడ్ వర్గాలు గుసగుసలు ప్రారంభించేశాయి.

"రాజమౌళితో కలసి టాలీవుడ్ దశ, దిశను మార్చే చిత్రం చేయాలని మహేష్ బాబు అనుకుంటున్నారు. అయితే, మరో 'బాహుబలి' వంటి సినిమా చేయాలని మహేష్ భావించడం లేదు. వీరిద్దరి మధ్యా గత కొంతకాలంగా ఎన్నో ఆలోచనలు వచ్చాయి. చివరకు స్టోరీ లైన్ ఖరారైంది" అని సమాచారం.

ప్రస్తుత చిత్రం షూటింగ్ పూర్తి కాగానే, ఈ భారీ చిత్రం టేకాఫ్ అవుతుందట. ఇది తెలుగు - హిందీ భాషల్లో రూపుదిద్దుకోనుందని కూడా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఇదో పెద్ద వార్తే!
Tollywood
Rajamouli
Mahesh Babu
RRR

More Telugu News