ముంబైలో కొత్త ఇల్లు కొనుగోలు చేసిన దీపిక-రణ్‌వీర్ జంట.. హాట్ టాపిక్‌గా మారిన ధర!
- జుహులో రూ. 50 కోట్ల విలువైన భవనం కొనుగోలు
- నేడు బారత్‌కు రానున్న కొత్త జంట
- 21న తొలి విందు
దీపిక పదుకొనే-రణ్‌వీర్ సింగ్‌లు ఇటీవల ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. ప్రపంచంలోనే రొమాంటిక్ డెస్టినేషన్ అయిన లేక్ కోమోలోని విల్లా డెల్ బాల్బియానెల్లోలో కొంకణి, సింధీ సంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి చేసుకున్నారు. నేడు భారత్‌కు రానున్న కొత్త జంట ఈనెల 21న బెంగళూరులో, 28న ముంబైలో వివాహ విందు ఇవ్వనున్నారు. రణ్‌వీర్‌కు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల కోసం డిసెంబరు 1న ముంబైలో మరో విందు ఇవ్వనున్నారు.