సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Add ap7am to your home Screen

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ఏడు సినిమాలున్నాయంటున్న రకుల్!
  • ఈ నెల 30న వర్మ 'భైరవ గీత' 
  • 'ఆర్ఆర్ఆర్' షూటింగులో రాంచరణ్  
*  తెలుగులో సినిమాలు చేయడం ఎప్పటికీ ఆపనని అంటోంది కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. 'హిందీతో కలిపి ప్రస్తుతం నా చేతిలో ఏడు సినిమాలు వున్నాయి. దాంతో చాలా బిజీగా వున్నాను. తెలుగు కూడా చేస్తాను. నాకు పేరు తెచ్చిన తెలుగు చిత్రాలను వదిలేది లేదు' అని చెప్పింది.
*  తెలుగు, కన్నడ భాషల్లో రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న 'భైరవ గీత' చిత్రం విడుదల వాయిదా పడింది. ఈ నెల 22న విడుదల కావలసిన ఈ చిత్రాన్ని ఈ నెల 30న రిలీజ్ చేస్తున్నట్టు వర్మ తాజా పోస్టర్ ద్వారా తెలిపారు. ఈ చిత్రం ద్వారా సిద్ధార్థ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
*  ప్రస్తుతం 'వినయ విధేయ రామ' చిత్రంలో నటిస్తున్న మెగా హీరో రాంచరణ్ రేపటి నుంచి రాజమౌళి చిత్రం షూటింగ్ లో పాల్గొంటాడు. 'ఆర్ఆర్ఆర్' వర్కింగ్ టైటిల్ తో రాజమౌళి రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు.
Rakul
varma
charan
NTR
Rajamouli

More Telugu News