తమిళనాట 'సర్కార్' 10 రోజుల వసూళ్లు
Add ap7am to your home Screen

తమిళనాట 'సర్కార్' 10 రోజుల వసూళ్లు

  • మాస్ మెచ్చే హీరో విజయ్ 
  • తమిళనాట 'సర్కార్' జోరు 
  • వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్  
మాస్ హీరోగా తమిళనాట విజయ్ కి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ కారణంగానే ఆయన తన సినిమాల్లో మాస్ ఆడియన్స్ కి నచ్చే అంశాలు ఉండేలా చూసుకుంటాడు. అలాంటి అంశాలతో వచ్చిన 'సర్కార్' విజయ్ అభిమానులను ఖుషీ చేస్తోంది. విడుదలైన తొలి రోజు నుంచే 'సర్కార్' కొత్త రికార్డులను నెలకొల్పుతూ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఆల్రెడీ 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇక ఒక్క తమిళనాడులోనే ఈ సినిమా 10 రోజుల్లో 110 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. '2.0' రిలీజ్ కి ఇంకా సమయం వుంది కనుక, అప్పటివరకూ ఈ సినిమా వసూళ్లకు ఢోకా ఉండదు. అందువలన ఈ సినిమా తమిళనాడు వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.    
vijay
keerti suresh

More Telugu News