ఇక అలాంటి పొరపాట్లు చేయదలచుకోలేదు: విజయ్ దేవరకొండ
Add ap7am to your home Screen

ఇక అలాంటి పొరపాట్లు చేయదలచుకోలేదు: విజయ్ దేవరకొండ

  • ఒకేసారి మూడు సినిమాలు 
  • 'నోటా' కథపై ఫోకస్ పెట్టలేకపోయాను 
  • ఇక హడావిడిగా సినిమాలు చేయను  
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రూపొందిన 'గీత గోవిందం' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత వచ్చిన 'నోటా' ఆయన అభిమానులను నిరాశ పరిచింది. తాజాగా ఈ విషయాన్ని గురించి విజయ్ దేవరకొండ ప్రస్తావించాడు. ఒకే సమయంలో నేను 'గీత గోవిందం' .. 'టాక్సీవాలా' .. 'నోటా' చేయవలసి వచ్చింది. ఒక షూటింగు నుంచి మరో షూటింగుకి వెంటవెంటనే మారిపోవలసి వచ్చింది.

అందువలన ఎక్కడ ఏం జరుగుతుందనేది నాకు అర్థం కాలేదు. ఈ కారణంగానే 'నోటా' కథపై పూర్తిగా ఫోకస్ పెట్టలేకపోయాను. ఆ సినిమాలోని పాయింట్ ను మరింత బలంగా చెబితే బాగుండేదేనని ఆ తరువాత అనిపించింది. ఈ సినిమా వలన నిర్మాత నష్టపోలేదు ... అంతవరకూ హ్యాపీ. ఇక నుంచి ఇలా హడావిడిగా సినిమాలు చేయకుండా కాస్త గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను'' అని చెప్పుకొచ్చాడు. 
vijay devarakonda

More Telugu News