హిందీ 'అర్జున్ రెడ్డి' గురించి విజయ్ దేవరకొండ
Add ap7am to your home Screen

హిందీ 'అర్జున్ రెడ్డి' గురించి విజయ్ దేవరకొండ

  • 'అర్జున్ రెడ్డి' ఫ్యాక్షన్ మూవీ అనుకున్నారు 
  • 'కబీర్ సింగ్' టైటిల్ బాగుంది 
  • హిందీలో హిట్ కొట్టి తీరుతుంది  
విజయ్ దేవరకొండ కెరియర్ ను మలుపు తిప్పిన చిత్రంగా 'అర్జున్ రెడ్డి' కనిపిస్తుంది. ఈ సినిమాతో ఆయనకి యూత్ లో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఈ సినిమాతో సందీప్ వంగా దర్శకుడిగా తన సత్తా చాటుకున్నాడు. ఇప్పుడు ఇదే సినిమాను షాహిద్ కపూర్ హీరోగా హిందీలో ఆయన రీమేక్ చేస్తున్నాడు.

ఈ సినిమాను గురించి తాజాగా విజయ్ దేవరకొండ స్పందిస్తూ .. "తెలుగులో 'అర్జున్ రెడ్డి' టైటిల్ చూసి అంతా కూడా ఇదేదో ఫ్యాక్షన్ మూవీ అనుకున్నారు. అలా కాకుండా హిందీ టైటిల్ 'కబీర్ సింగ్' చాలా బాగుంది. తప్పకుండా అక్కడ కూడా సందీప్ వంగా తన సత్తా చాటుతాడనే నమ్మకం వుంది. ఈ సినిమా టీజర్ కోసం నేను కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. హిందీలోనూ ఈ సినిమా భారీ హిట్ కొడుతుందని భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు. 'అర్జున్ రెడ్డి' తమిళంలోను 'వర్మ' పేరుతో రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే.    
vijay devarakonda
sandeep vanga

More Telugu News