రాజమౌళి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేశ్
Add ap7am to your home Screen

రాజమౌళి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేశ్

  • ఇటీవలే లాంచ్ అయిన మల్టీ స్టారర్ 
  • కథలో ముగ్గురు కథానాయికలకు చోటు 
  • మిగతా ఇద్దరు కథానాయికలు ఎవరనే ఆసక్తి
రాజమౌళి మల్టీ స్టారర్ మూవీ ఇటీవలే లాంచ్ అయింది. ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా నటించనున్న ఈ సినిమా, ఈ నెల 29వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. భారీ యాక్షన్ ఎపిసోడ్ కి ప్లాన్ చేసినట్టుగా సమాచారం.

ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు వుండనున్నారనే టాక్ వచ్చింది. ఒక కథానాయికగా కీర్తి సురేశ్ ను ఎంపిక చేసుకున్నారనేది తాజా సమాచారం. ఇటీవల కాలంలో తెలుగు .. తమిళ భాషల్లో కీర్తి సురేశ్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో తెలిసిందే. ఈ సినిమా రెండవ షెడ్యూల్లో కీర్తి సురేశ్ జాయిన్ కానుందని అంటున్నారు. ఇక ఆమె ఎన్టీఆర్ సరసన కనిపిస్తుందా? చరణ్ జోడీగా అలరిస్తుందా? అనే విషయంలోనే స్పష్టత రావాలి. అలాగే మిగతా ఇద్దరు కథానాయికలు ఎవరనే సస్పెన్స్ కూడా వీడవలసి వుంది.      
ntr
charan

More Telugu News