మరికొంత తగ్గిన 'పెట్రో' ధరలు!

  • లీటరు పెట్రోలుపై 15 పైసల తగ్గింపు
  • 10 పైసలు తగ్గిన డీజిల్ ధర
  • హైదరాబాద్ లో రూ. 82.54కు పెట్రోలు ధర
పెట్రోలు, డీజిల్ ధరల తగ్గుదల కొనసాగుతోంది. మూడు వారాలకు పైగా నిత్యమూ ధరలు తగ్గుతుండగా, గురువారం నాడు లీటరు పెట్రోలుపై 15 పైసలు, డీజిల్ పై 10 పైసల మేరకు ధరను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 77.28కు తగ్గగా, డీజిల్ ధర రూ. 72.09కి చేరింది. ఇదే సమయంలో ముంబైలో పెట్రోలు ధర రూ. 82.80కు, డీజిల్ ధర రూ. 75.53కు చేరుకుంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే లీటర్ పెట్రోల్ ధర రూ. 82. 54కు, డీజిల్ ధర రూ. 78.32కు తగ్గింది.
Go Back to Shorts
Petrol
Diesel
Prise Slash
IOCL

More Telugu News