'భారతీయుడు 2'లో కీలక పాత్రలో శింబు!
- కమల్ సరసన కాజల్
- పోలీస్ ఆఫీసర్ గా శింబు
- ముఖ్యమైన పాత్రలో దుల్కర్
ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ను తీసుకున్నారు. మరో కీలకమైన పాత్ర కోసం శింబును ఎంపిక చేసుకున్నారనేది తాజా సమాచారం. ఈ సినిమాలో శింబు పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని అంటున్నారు. దుల్కర్ .. శింబు పాత్రలు సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాకి అనిరుథ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.