venkatesh: 'వెంకీ మామ'ఈ రోజునే రంగంలోకి దిగుతున్నాడు

షార్ట్స్‌లో చూడండి
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ తో కలిసి 'ఎఫ్ 2' అనే మల్టీస్టారర్ ను పూర్తి చేసిన వెంకటేశ్, బాబీ దర్శకత్వంలో నాగచైతన్యతో కలిసి మరో మల్టీ స్టారర్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకి 'వెంకీ మామ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ రోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఫస్టు షెడ్యూల్లో ప్రధాన పాత్రలకి సంబంధించి కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఈ కామెడీ ఎంటర్టైనర్ లో వెంకీ సరసన హ్యూమా ఖురేషి .. చైతూ జోడీగా రకుల్ కనిపించనున్నారు. గతంలో చైతూ చేసిన 'ప్రేమమ్' చిత్రంలో వెంకటేశ్ మెరిశారు. నిజ జీవితంలోను మేనమామ - మేనల్లుడు అయిన ఈ ఇద్దరూ, తెరపై అదే తరహా పాత్రలను పోషిస్తుండటం విశేషం. ఇక 'రారండోయ్ వేడుక చూద్దాం' తరువాత చైతూతో కలిసి రకుల్ మరోసారి నటిస్తుండటం మరో విశేషం. 
Go Back to Shorts
venkatesh
chaithu
rakul

More Telugu News