Visakha: విహారయాత్రలో విషాదం.. ఆరుగురి గల్లంతు

షార్ట్స్‌లో చూడండి
ఆనందంగా విహారయాత్రకు వెళ్లిన యువకులు.. సముద్రంలో స్నానానికి దిగారు. వారిలో సగం మందే ఒడ్డుకు చేరుకోవడంతో విశాఖ యారాడ తీరంలో విషాదం నెలకొంది. విశాఖ హౌసింగ్ బోర్డు, కేఆర్ఎం కాలనీకి చెందిన 12 మంది యువకులు విహార యాత్ర కోసం యారాడ బీచ్‌కు వెళ్లారు. కొంతసేపు ఆనందంగా గడిపాక స్నానానికని సముద్రంలోకి దిగారు.

అలల ఉద్ధృతికి అందరూ కొట్టుకుపోతుండగా గమనించిన జాలర్లు కొందరిని ఒడ్డుకు తీసుకొచ్చి.. అధికారులకు సమాచారమిచ్చారు. గల్లంతైన వారిలో వాసు, తిరుపతి, గణేశ్, దుర్గ, రాజేశ్, శ్రీను ఉన్నారు. గల్లంతైనవారిని ఇసుకతోట దగ్గర దుర్గానగర్ ఎస్సీ కాలనీకి చెందిన యువకులుగా గుర్తించారు. వీరికోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే చీకటి పడుతుండటంతో గాలింపు చర్యలకు విఘాతం కలుగుతోందని అధికారులు భావిస్తున్నారు.
Go Back to Shorts
Visakha
Tirupathi
Ganesh
Vasu
Durga
Rajesh

More Telugu News