'సర్కార్'పై ఎందుకీ రాద్ధాంతం... అమ్మ అసలు పేరు కోమలవల్లి కాదు: దీప
- గతవారం విడుదలైన 'సర్కార్'
- సినిమాను నిషేధించాలని అన్నాడీఎంకే డిమాండ్
- స్పందించిన జయ మేనకోడలు దీప
తమిళ ప్రజలు అమ్మగా పిలుచుకునే జయలలిత అసలు పేరు కోమలవల్లి కాదని అన్నారు. మైసూర్ లో పుట్టిన ఆమెకు జయ అనే పేరునే పెట్టారని, ఆమె గురించి తన తండ్రికి బాగా తెలుసునని, చిన్నప్పుడు అమ్ము అని ముద్దుగా పిలుచుకునేవారని అన్నారు. ఈ సినిమాపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. కాగా, శశికళ వర్గం నేత దినకరన్ సైతం జయలలిత అసలు పేరు కోమలవల్లి కాదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.