‘RRR’లోనే చిత్ర టైటిల్ కూడా ఉందట...

  • ఈనెల 11న ప్రారంభం కాబోతున్న మల్టీస్టారర్
  • ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రభాస్
  • టైటిల్ విషయమై ఆసక్తికర న్యూస్
దర్శకధీరుడు రాజమౌళి మల్టీస్టారర్ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ఇప్పటికే పూర్వ నిర్మాణపనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 11న  ప్రారంభం కాబోతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభాస్ హాజరుకానున్నారని సమాచారం.

ఈ సినిమా విషయమై ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ఇప్పటి వరకూ ‘RRR’ అంటే రాజమౌళి, రామారావు, రామ్ చరణ్‌గానే మనకు తెలుసు కానీ అందులోనే టైటిల్ కూడా ఉందని టాలీవుడ్ టాక్. ‘RRR’ అంటే ‘రామ రావణ రాజ్యం’అట. ఈ చిత్రానికి సంబంధించి మరో టైటిల్ కూడా హల్‌చల్ చేస్తోంది. అది ‘తారక్‌రామ్’. మరి ఈ రెండింటిలో నిజమైన టైటిట్ ఏదో.. లేదంటే ఇవి రెండూ కాకుండా మరేదైనా ఉందో అధికారిక ప్రకటన వెలువడితే కానీ తెలియదు.
Go Back to Shorts
Rajamouli
Junior Ntr
Ram charan
Rama Ravana Rajyam
Tarak Ram

More Telugu News