'మహర్షి' హిందీ శాటిలైట్ హక్కులు .. 20 కోట్ల డీల్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మహర్షి' హిందీ శాటిలైట్ హక్కులు .. 20 కోట్ల డీల్!

  • మహేశ్ 25వ మూవీగా 'మహర్షి'
  • నిర్మాతగా దిల్ రాజు 
  • దర్శకుడిగా వంశీ పైడిపల్లి         
మహేశ్ బాబు 25వ సినిమాగా 'మహర్షి' రూపొందుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు - అశ్వనీ దత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా హిందీ శాటిలైట్ హక్కుల విషయంలో భారీ డీల్ కుదిరినట్టుగా తెలుస్తోంది. తెలుగు సినిమాలకి హిందీ మార్కెట్లో మంచి క్రేజ్ వుంది. తెలుగు సినిమాను హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్ లో వదిలితే చాలు, కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చిపడుతున్నాయి.

దాంతో హిందీ శాటిలైట్ హక్కుల నిమిత్తం ఎంత మొత్తం చెల్లించడానికైనా కొన్ని సంస్థలు వెనకాడటం లేదు. 'మహర్షి' హిందీ శాటిలైట్ హక్కులకు దిల్ రాజు 25 కోట్లు చెప్పారట. 20 కోట్లు చెల్లించడానికి ఒక సంస్థ ముందుకు రావడంతో, ఆయన ఆ డీల్ ను ఓకే చేసినట్టుగా చెబుతున్నారు. గతంలో 'రంగస్థలం' హిందీ శాటిలైట్ హక్కులు 22 కోట్లకి పోతే, 20 కోట్లతో 'మహర్షి' రెండవస్థానంలో నిలిచింది.  
Mahesh Babu

More Telugu News