‘సర్కార్’ సెగలు.. అరెస్ట్ వార్తలపై స్పందించిన దర్శకుడు మురుగదాస్!
- నిన్న రాత్రి నా ఇంటికి పోలీసులు వచ్చారు
- చాలాసార్లు తలుపులు తట్టారు
- ట్విట్టర్ లో స్పందించిన దర్శకుడు
ఈ మేరకు సర్కార్ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్’ ట్వీట్ చేసింది. దీంతో ఈ వ్యవహారంపై మురుగదాస్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘పోలీసులు నా ఇంటికి రాత్రిపూట వచ్చి తలుపులు చాలాసార్లు కొట్టారు. కానీ నేను ఇంటిలో లేకపోవడంతో వెళ్లిపోయారు. ఇప్పుడు నా ఇంటి ముందు పోలీస్ అధికారులెవరూ లేరు’ అని మురుగదాస్ నిన్న రాత్రి ట్వీట్ చేశారు. స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా నవంబర్ 6న విడుదల అయింది.