సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Add ap7am to your home Screen

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • నాలుగు రోజుల్లో డబ్బింగ్ చెప్పేసిన ఇలియానా 
  • 'ఎన్టీఆర్' బయోపిక్ లో రచయిత సాయిమాధవ్   
  • విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా' సెన్సార్ పూర్తి
  • 'పడిపడి లేచె మనసు' విడుదల తేదీ ఖరారు  
*  'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రం కోసం కథానాయిక ఇలియానా తొలిసారిగా డబ్బింగ్ చెప్పింది. పాత్ర డిమాండ్ చేయడం వల్లే ఆమె సొంతంగా డబ్బింగ్ చెప్పిందని, అది కూడా కేవలం నాలుగు రోజుల్లోనే పూర్తిచేసిందని నిర్మాతలు చెప్పారు. ఆమె వాయిస్ చిత్రానికి అదనపు ఆకర్షణ అవుతుందని అన్నారు.
*  ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా కూడా 'ఎన్టీఆర్' బయోపిక్ తారాగణంలో చేరిపోయారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పర్శనల్ మేకప్ మెన్ పీతాంబరం పాత్రను సాయిమాధవ్ ధరిస్తున్నట్టు సమాచారం.
*  విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన 'టాక్సీవాలా' చిత్రం సెన్సార్ పూర్తయింది. రాహుల్ శంక్రష్ణన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెల 17న విడుదల చేస్తున్నారు.
*  శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన 'పడిపడి లేచె మనసు' చిత్రం విడుదలలో ఎటువంటి వాయిదా లేదని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. మొదట ప్రకటించినట్టుగానే డిసెంబర్ 21న చిత్రాన్ని రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు. ఈ చిత్రం విడుదల వచ్చే ఏడాదికి వాయిదా పడిందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో నిర్మాతలు ఈ వివరణ ఇచ్చారు.
Eliana
Raviteja
vijay
sharwanand

More Telugu News