విజయ్ 'సర్కార్' చిత్రంపై ప్రేక్షకుల రెస్పాన్స్!
Add ap7am to your home Screen

విజయ్ 'సర్కార్' చిత్రంపై ప్రేక్షకుల రెస్పాన్స్!

  • చాలా స్టైలీష్ గా కనిపించిన విజయ్ 
  • యాక్షన్ .. ఎమోషన్స్ లో మెప్పించాడు
  • మురుగదాస్ తో కలిసి హ్యాట్రిక్  
మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ కథానాయకుడిగా నటించిన 'సర్కార్' చిత్రం, తెలుగు .. తమిళ భాషల్లో ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, వరలక్ష్మి శరత్ కుమార్ నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను పోషించింది. ఈ సినిమా చూసిన వాళ్లు .. నటన పరంగా విజయ్ బాగా చేశాడని అంటున్నారు. సీఈవోగా విజయ్ చాలా స్టైలీష్ గా కనిపించాడని చెబుతున్నారు.

యాక్షన్ సీన్స్ లోను .. ఎమోషన్స్ సీన్స్ లోను విజయ్ శభాష్ అనిపించాడని అంటున్నారు. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వచ్చే సీన్స్ లో ఆయన నటన చూసితీరవలసిందేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజయ్ కెరియర్లో ఇది చెప్పుకోదగిన చిత్రమవుతుందనీ, మురుగదాస్ కాంబినేషన్లో ఆయనకి హ్యాట్రిక్ హిట్ పడినట్టేననేది అభిమానుల మాట. ఇక వసూళ్ల విషయంలో ఈ సినిమా కొత్త రికార్డులకు తెరతీస్తుందేమో చూడాలి.      
vijay
keerti
varalakshmi

More Telugu News