2.0: 'చిట్టి' కోసం వెయిట్ చేస్తున్నా: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు

షార్ట్స్‌లో చూడండి
"విజువల్స్, కాన్సెప్ట్ అదిరిపోయాయి. చిట్టి చేసే విధ్వంసాన్ని స్క్రీన్‌ పై చూసేందుకు ఎదురుచూస్తున్నా. శంకర్, రజనీకాంత్ సార్, అక్షయ్ కుమార్, ఏఆర్ రహ్మన్, మీ టీమ్ మొత్తానికీ నా అభినందనలు"... ఇటీవల విడుదలైన '2.0' ట్రయిలర్ ను చూసి ఫిదా అయిన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలివి.

సినీ అభిమానులు ఈ సినిమా గురించి ఎంతగా ఉహించుకున్నారో, అంతకంటే ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్ ఈ ట్రయిలర్ లో కనిపించడంతో, అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇక మహేష్ బాబు ట్వీట్‌ పై అక్షయ్ కుమార్ స్పందించారు. దీన్ని రీట్వీట్ చేసిన అక్షయ్ 'కృతజ్ఞతలు' అని పేర్కొన్నారు. ఈ చిత్రం నెలాఖరులో విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
2.0
Robo
Chitti
Mahesh Babu
Rajanikant
Shankar

More Telugu News