పంబకు చేరుకుంటున్న అతివలు... భారీ భద్రత!

  • 'సేవ్ శబరిమల' అంటున్న భక్తులు
  • సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలంటున్న మహిళలు
  • మహిళలకు భద్రత కల్పిస్తామంటున్న పోలీసులు
ఓ వైపు సేవ్ శబరిమల నినాదాలతో అయ్యప్ప సన్నిధానం మారుమోగుతుండగా, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తమకు అయ్యప్ప దర్శనం చేయించాలని కోరుతూ పదుల సంఖ్యలో అతివలు పంబ వద్దకు చేరుకుంటున్నారు. నిన్న సాయంత్రం తెరచుకున్న దేవాలయం తలుపులు, నేటి రాత్రి మూసుకోనుండగా, ఈలోగా స్వామిని దర్శించుకుంటామని కొందరు మహిళలు అంటున్నారు.

ఇప్పటికే సన్నిధానం నుంచి పంబ, నీలక్కల్ ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు, భక్తులు హద్దుమీరితే కఠిన చర్యలు తప్పవని అంటున్నారు. మహిళా భక్తులకు పూర్తి రక్షణ కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు. మొత్తం 2,300 మందికి పైగా పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం ప్రకటించింది.
Go Back to Shorts
Sabarimala
Supreme Court
Ladies

More Telugu News