తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనపై కీలక ఉత్తర్వులు జారీచేసిన సుప్రీంకోర్టు!
- ఏపీ ప్రభుత్వ అఫిడవిట్ పై సంతృప్తి
- జడ్జీలకు నివాసాలు ఏర్పాటు చేయాలని ఆదేశం
- జనవరికల్లా పూర్తవుతుందని ఆశాభావం
అమరావతిలో జస్టిస్ సిటీ నిర్మాణంలో ఉన్నందున తాత్కాలిక భవనంలో హైకోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అఫిడవిట్ ను సమర్పించింది. ఈ నేపథ్యంలో స్పందించిన జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్ ల ధర్మాసనం.. హైకోర్టు జడ్జీలకు అద్దె భవనాల్లో తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ పై సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. మౌలిక సదుపాయాల కల్పన పూర్తయ్యాక హైకోర్టు విభజన పూర్తి స్థాయిలో జరుగుతుందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.