రాజమౌళి సినిమా లాంచ్ రోజునే హీరోయిన్ల పేర్లను ప్రకటిస్తారట!
Add ap7am to your home Screen

రాజమౌళి సినిమా లాంచ్ రోజునే హీరోయిన్ల పేర్లను ప్రకటిస్తారట!

  • రాజమౌళి సినిమాకి ముహూర్తం ఖరారు
  • టైటిల్ పై అందరిలోనూ ఆసక్తి 
  • హీరోయిన్స్ విషయంలో రానున్న క్లారిటీ       
రాజమౌళి తదుపరి సినిమా ఎన్టీఆర్ ..  చరణ్ లతో వుండనుందనే విషయం తెలిసిన దగ్గర నుంచి, ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వాళ్ల నిరీక్షణకు తెరదించేస్తూ .. ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ సినిమా పూజా కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ ప్రకటనకు సంబంధించిన వీడియోను కూడా వదలడంతో, అంతా ఈ విషయాన్ని గురించే మాట్లాడుకుంటున్నారు.

టైటిల్ ను ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారు? .. హీరోయిన్లుగా ఎవరిని తీసుకున్నారు? వంటి ప్రశ్నలు అందరిలోనూ తలెత్తాయి. టైటిల్ సంగతి అటుంచితే, హీరోయిన్లు ఎవరనే విషయాన్ని మాత్రం ఈ సినిమా లాంచ్ రోజున ఎనౌన్స్ చేసేస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే వాళ్ల ఎంపిక పూర్తయిందనీ .. అందువలన 11వ తేదీన ఎనౌన్స్  చేయడం ఖాయమని చెప్పుకుంటున్నారు. హీరోయిన్స్ గా ఎవరు ఛాన్స్ కొట్టేశారో చూడాలి మరి.    
ntr
charan

More Telugu News