parents: కేఎఫ్‌సీ వ్యవస్థాపకుడి పేరు పెట్టుకున్న చిన్నారికి రూ. 8 లక్షల రివార్డు!

షార్ట్స్‌లో చూడండి
అమెరికాకు చెందిన ఓ జంట పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. ఇటీవల జన్మించిన తమ కుమార్తెకు కేఎఫ్‌సీ వ్యవస్థాపకుడు కల్నల్ హార్లాండ్ డేవిడ్ శాండర్స్ పేరు పెట్టడమే అందుకు కారణం. సెప్టెంబరు 9న జన్మించిన ఈ చిన్నారికి చికెన్ రెస్టారెంట్ చైన్ కేఎఫ్‌సీ 11 వేల డాలర్లు (రూ.8 లక్షలు) రివార్డు అందించింది.

చిన్నారి తల్లిదండ్రులు ఇద్దరూ కేఎఫ్‌సీకి వీరాభిమానులు. దీంతో తమకు పుట్టే బిడ్డకు కేఎఫ్‌సీ అధినేత పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా తమ కుమార్తెకు కల్నల్ హార్లాండ్ శాండర్ పేరు కలిసొచ్చేలా హర్లాండ్ రోజ్‌ అని పేరు పెట్టారు. కేఎఫ్‌సీ బేబీ హర్లాండ్ పేరుతో ఓ పోటీ నిర్వహించింది. ఆ పోటీలో పాల్గొన్న హర్లాండ్ రోజ్ విజేతగా నిలిచింది. 11 వేల డాలర్లను బహుమతిగా అందుకుంది. ఈ సొమ్మును చిన్నారి ట్యూషన్ ఫీ కోసం ఉపయోగించనున్నారు.
Go Back to Shorts
parents
Colonel Harland Sanders
KFC
contest

More Telugu News