దారికి అడ్డుగా కూర్చుందని మరదలిని చంపేసిన బావ!
- తూర్పు గోదావరి జిల్లాలో ఘటన
- అంట్లు తోముకుంటున్న మరదలిపై కర్రతో దాడి
- తీవ్రగాయంతో మరణించిన మరదలు
ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంటి ముందు రోడ్డుపై మాధవి అంట్లు తోముతుండగా, ఆమె బావ శ్రీనివాస్ మద్యం తాగి అటుగా వచ్చాడు. ఇలా అడ్డుగా కూర్చుంటే, తను ఇంట్లోకి ఎలా వెళ్లాలి? అంటూ ఆగ్రహంతో వాగ్వాదానికి దిగాడు. పక్కనుంచి వెళ్లాలని మాధవి చెప్పగా, పక్కనే ఉన్న కర్ర తీసుకుని, ఆమె తలపై బలంగా మోదాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై మాధవి అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.