షూటింగ్ చూసేందుకు వెళ్తే రణ్‌వీర్‌ను గెంటేశారట.. కారణం చెప్పిన రవీనా!
- ‘కాఫీ విత్ కరణ్’లో పంచుకున్న రణ్‌వీర్
- రణ్‌వీర్ చిన్నవాడని చెప్పిన రవీనా
- చెడు ప్రభావం చూపిస్తుందనే పంపించినట్టు వెల్లడి
అప్పుడు రణ్‌వీర్ చిన్నవాడే కాకుండా అల్లరి వాడని ఆమె తెలిపారు. అక్షయ్, తాను పాల్గొనగా అప్పుడు ఓ వానపాటను చిత్రీకరిస్తున్నారని.. దానిలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని రవీనా తెలిపారు. పిల్లలు అలాంటివి చూస్తే వారిపై చెడు ప్రభావం చూపించే అవకాశముందనే కారణంగా సెట్‌లో నిర్మాతకు చెప్పి రణ్‌వీర్‌ని బయటకు పంపించినట్టు రవీనా వెల్లడించారు. రణ్‌వీర్‌పై తనకు ఎలాంటి కోపమూ లేదని ఆమె తెలిపారు.