trivikram: త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ మూవీ ఇప్పట్లో లేనట్టే!

షార్ట్స్‌లో చూడండి
వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా ఉంటుందని కొంతకాలం క్రితం హారిక అండ్ హాసిని బ్యానర్ వారు ప్రకటించారు. దాంతో వెంకటేశ్ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఎందుకంటే, గతంలో వెంకటేశ్ చేసిన 'నువ్ నాకు నచ్చావ్' .. 'మల్లీశ్వరి' సినిమాలకి త్రివిక్రమ్ సంభాషణలు అందించగా అవి ఘన విజయాలను సాధించాయి. అలాంటిది ఈ సారి త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నాడనగానే సంబరపడిపోయారు.

అయితే వాళ్లకి నిరాశను కలిగించే వార్త ఒకటి ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను అల్లు అర్జున్ తో చేయనున్నాడనీ, ఆ తరువాత సినిమాను మహేశ్ బాబుతో చేసే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. ఇక చరణ్ .. అఖిల్ కూడా తమ తదుపరి ప్రాజెక్టుల కోసం త్రివిక్రమ్ పై దృష్టి పెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వెంకటేశ్ తో త్రివిక్రమ్ మూవీ ఇప్పట్లో ఉండకపోవచ్చని అంటున్నారు.   
Go Back to Shorts
trivikram
venkatesh

More Telugu News