Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్న పవన్ కల్యాణ్.. షెడ్యూల్ ఖరారు!

షార్ట్స్‌లో చూడండి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన ఖరారైంది. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన పవన్ జనసేన సమన్వయ కమిటీలను నియమించడంతో పాటు పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. తాజాగా ఆయన రేపటి నుంచి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు జనసేన కార్యాలయం ఈ రోజు అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకూ పవన్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా కాకినాడలోని ఏడు నియోజకవర్గాల్లో పవన్ యాత్ర సాగనుంది. జనసేన కేడర్ ను ఎన్నికలకు సన్నద్ధం చేయడంలో భాగంగా పవన్ యాత్ర చేపట్టనున్నారు. పర్యటనలో భాగంగా ప్రజలతో పవన్ ముఖాముఖి సమావేశం అవుతారు.

రేపు ఉదయం విజయవాడలోని జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, అన్నవరం, సామర్లకోట మీదుగా పవన్ తునికి చేరుకుంటారు. తొలిరోజు తునిలోని గొల్ల అప్పారావు సెంటర్ లో నిర్వహించే బహిరంగ సభలో జనసేనాని పాల్గొంటారు. నియోజకవర్గాల్లో పర్యటన సందర్భంగా ప్రజలతో నేరుగా మాట్లాడి స్థానిక సమస్యలను తెలుసుకుంటారు.
Go Back to Shorts
Andhra Pradesh
East Godavari District
Jana Sena
Pawan Kalyan
tour
tuni
Vijayawada
janmabhumi express

More Telugu News