బడా వ్యాపారికి వలేసిన అందమైన భామ... వలలో పడని బిజినెస్ మేన్!
Add ap7am to your home Screen

బడా వ్యాపారికి వలేసిన అందమైన భామ... వలలో పడని బిజినెస్ మేన్!

  • వివాహమైందా? స్నేహితులున్నారా? అంటూ మెసేజ్ లు
  • స్నేహం చేయాలని వాట్స్ యాప్ లో వేధింపులు
  • పోలీసులను ఆశ్రయించిన వ్యాపారి విజయ్ నారంగ్
ఓ అందమైన అమ్మాయి వలేసింది. మీకు వివాహమైందా? స్నేహితులు ఉన్నారా? అంటూ బడా వ్యాపారికి లైనేసింది. గాళ్ ఫ్రెండ్ లేరుగా? నాతో స్నేహం చేస్తారా? అంటూ పరిచయం పెంచుకుంది. అతన్ని బుట్టలో వేసుకోవాలన్న ఆమె ప్రయత్నాలు సాగలేదు. అహ్మదాబాద్ పోలీసుల ముందుకు వచ్చిన ఫిర్యాదు వెనుక పూర్వపరాలను పరిశీలిస్తే, గుజరాత్, అహ్మదాబాద్ కు చెందిన విజయ్ నారంగ్ (38) బిజినెస్ మేన్. అతనికి ఓ అమ్మాయి ఫోన్ ద్వారా పరిచయం అయింది. నిత్యమూ వాట్స్ యాప్ లో కాల్ చేస్తూ, స్నేహం చేయాలని వేధింపులు ప్రారంభించింది. దీన్ని మోసంగా భావించిన నారంగ్, ఆమె ఫోన్ ను వాట్స్ యాప్ లో బ్లాక్ చేయగా, ఫోన్ నంబర్ కు మెసేజ్ లు పంపడం ప్రారంభించింది. ఆమె వేధింపులు తగ్గకపోవడంతో, పోలీసులను ఆశ్రయించాడు నారంగ్. దీంతో ఐపీసీ సెక్షన్ 507 కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ యువతి ఎవరన్న విషయమై విచారణ ప్రారంభించారు.
Gujarath
Ahmadabad
Vijay Narang
Businessman

More Telugu News