తెలంగాణలో మావోయిస్టుల కలకలం.. బ్యానర్లు కట్టి మందుపాతరలు పెట్టిన వైనం !
- జయశంకర్ భూపాలపల్లిలో ఘటన
- వెంకటాపురం రహదారిపై బ్యానర్లు
- ఎన్నికలు బహిష్కరించాలని పిలుపు
జిల్లాలోని వెంకటాపురంలో ఉన్న రహదారిపై ఈరోజు బ్యానర్లు వెలిశాయి. ఈ ఎన్నికలను బహిష్కరించాలని అందులో పిలుపునిచ్చారు. ఈ మేరకు బ్యానర్లతో పాటు రెండు మందుపాతరలను అక్కడ మావోలు అమర్చారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం మందుపాతరలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చాలాకాలం ప్రశాంతంగా ఉన్న జిల్లాలో మళ్లీ మావోలు ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు.