vishal: పెళ్లంటూ చేసుకుంటే ప్రేమపెళ్లే చేసుకుంటాను: హీరో విశాల్

షార్ట్స్‌లో చూడండి
విశాల్ .. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రేమాయణం గురించిన వార్తలు కోలీవుడ్లో చాలాకాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాను పెళ్లంటూ చేసుకుంటే ప్రేమపెళ్లే చేసుకుంటానని విశాల్ తాజా ఇంటర్వ్యూలో అనడం హాట్ టాపిక్ గా మారింది. "ఎక్కడికి వెళ్లినా నా పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నాక్కూడా త్వరగా పెళ్లి చేసుకోవాలని వుంది.

కానీ అంతకంటే ముఖ్యమైన నిర్మాతల మండలి భవన నిర్మాణం పనులను పూర్తి చేయవలసి వుంది. దీని వలన ఎంతోమంది పేద కళాకారులకు మేలు జరుగుతుంది. నేను పెళ్లంటూ చేసుకుంటే ప్రేమపెళ్లే చేసుకుంటాను. అమ్మాయి కూడా రెడీగా వుంది .. అమ్మాయి తరఫు వాళ్లు కూడా సిద్ధంగానే వున్నారు. నా లవ్ మ్యారేజ్ విషయంలో మా అమ్మానాన్నలకు కూడా ఎలాంటి అభ్యంతరంలేదు" అని చెప్పుకొచ్చాడు. దాంతో ఆయన పెళ్లి చేసుకునేది వరలక్ష్మి శరత్ కుమార్ నా? వేరే అమ్మాయినా? అనే విషయం మరింత ఆసక్తికరంగా మారింది.   
Go Back to Shorts
vishal

More Telugu News