చినరాజప్పపై ప్రశంసలు కురిపించిన నటుడు ఆర్.నారాయణమూర్తి

  • సామర్లకోటలో ఒకే రైలు నుంచి దిగిన చినరాజప్ప, నారాయణమూర్తి
  • నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నారంటూ కితాబు
  • మహారాణి కళాశాల, రౌతులపూడి ఆసుపత్రిని అభివృద్ధి చేయాలంటూ విన్నపం
ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పపై ప్రముఖ సినీ నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి ప్రశంసలు కురిపించారు. పెద్దాపురం నియోజకవర్గ అభివృద్ధికి చినరాజప్ప ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. యశ్వంత్ పూర్ రైల్లో ప్రయాణించిన నారాయణమూర్తి నిన్న సామర్లకోట స్టేషన్ లో దిగారు. అదే రైలు నుంచి చినరాజప్ప కూడా దిగారు.

ఈ సందర్భంగా ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. తాను చదుకున్న పెద్దాపురం మహారాణి కళాశాలతో పాటు... తన సొంత నిధులతో తాను నిర్మించిన రౌతులపూడి ఆసుపత్రిని కూడా అన్ని విధాలా అభివృద్ధి చేయాలని కోరారు. నారాయణమూర్తి విన్నపం పట్ల హోం మంత్రి సానుకూలంగా స్పందించారు. 
Go Back to Shorts
chinarajappa
r narayanamurthy
tollywood

More Telugu News