తారక్ లా నేను చేయలేను: 'టెంపర్' రీమేక్ గురించి విశాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తారక్ లా నేను చేయలేను: 'టెంపర్' రీమేక్ గురించి విశాల్

  • 'అయోగ్య' పేరుతో తమిళంలోకి 'టెంపర్' 
  • తమిళంలో మాత్రమే విడుదల 
  • సీక్వెల్ దిశగా 'డిటెక్టివ్' .. 'అభిమన్యుడు'
మాస్ హీరోగా తెలుగు .. తమిళ భాషల్లో విశాల్ కి మంచి క్రేజ్ వుంది. అందువలన ఆయన తమిళ సినిమాలన్నీ తెలుగులోను విడుదలవుతుంటాయి. రీసెంట్ గా వచ్చిన 'పందెం కోడి 2' సినిమా కూడా తమిళంతో పాటు తెలుగులోను మంచి వసూళ్లను రాబట్టింది.

 ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ, 'పందెం కోడి'కి సీక్వెల్ చేస్తే సక్సెస్ అవుతుందనే నమ్మకం మొదటి నుంచి వుంది. ఆ నమ్మకాన్ని 'పందెం కోడి 2' సినిమా నిలబెట్టింది. దాంతో 'పందెం కోడి 3' చేయాలనే ఆలోచన కలిగింది. ఈ సీక్వెల్ కి అవసరమైన కథ రెడీ అవుతోంది. అలాగే తెలుగులోను బాగా ఆడిన 'డిటెక్టివ్'కి .. 'అభిమన్యుడు'కి కూడా సీక్వెల్స్ చేయాలనే ఆలోచనలో వున్నాను.

ఇక తెలుగులో ఎన్టీఆర్ చేసిన 'టెంపర్' ను 'అయోగ్య' పేరుతో రీమేక్ చేయనున్నాను. అయితే ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసే ఆలోచన లేదు. తారక్ మాదిరిగా నేను చేయలేను .. అందువలన ఈ సినిమా తమిళంలో మాత్రమే విడుదలవుతుంది" అని చెప్పుకొచ్చాడు.    
vishal

More Telugu News