venkatesh: 'వెంకీ మామా' ప్రాజెక్టు గురించి ఫిల్మ్ నగర్ టాక్

షార్ట్స్‌లో చూడండి
ఈ మధ్య కాలంలో వెంకటేశ్ ఎక్కువగా మల్టీ స్టారర్ సినిమాలకి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు. అలా ఆయన ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' అనే మల్టీ స్టారర్ మూవీ చేశారు. ఈ సినిమా తరువాత ఆయన బాబీ దర్శకత్వంలో 'వెంకీ మామా' అనే మరో మల్టీ స్టారర్ చేయవలసి వుంది. నాగచైతన్య మరో హీరోగా చేయనున్న ఈ సినిమా, ఇటీవలే పూజా కార్యక్రమాలను కూడా జరుపుకుంది.ఈ సినిమాకి సురేశ్ బాబు నిర్మాతగా వ్యవహరించాలనుకున్నారు. కానీ పూర్తి స్క్రిప్ట్ ఆయనకి సంతృప్తిని కలిగించలేదనేది ఫిల్మ్ నగర్ టాక్. పూర్తి స్క్రిప్ట్ పై నాలుగైదుసార్లు చర్చలు జరిపిన తరువాత కూడా సురేశ్ బాబు సంతృప్తి చెందలేదట. సందేహంతో ముందుకు తీసుకెళ్లడం కంటే ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేయడమే మంచిదనే నిర్ణయానికి ఆయన వచ్చేశాడని చెబుతున్నారు. చాలా కాలంగా ఇదే సబ్జెక్ట్ పై కసరత్తు చేస్తూ వచ్చిన బాబీ, ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.    
Go Back to Shorts
venkatesh
nagachaithanya

More Telugu News