prachi telan: తెలుగు తెరకి మరో కొత్త కథానాయిక!

షార్ట్స్‌లో చూడండి
కొత్తదనం కోసం దర్శక నిర్మాతలు తెలుగు తెరకి కొత్త కథానాయికలను పరిచయం చేస్తూ వస్తున్నారు. అందంతో పాటు అభినయం వున్న వాళ్లు మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు. తొలి ప్రయత్నంలోనే సక్సెస్ ను సాధించినవాళ్లు, వరుస అవకాశాలను అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగు తెరకి మరో కొత్త కథానాయిక పరిచయం అవుతోంది .. ఆ అమ్మాయి పేరే 'ప్రాచీ తేలన్'.

రకుల్ సోదరుడు 'అమన్' కథానాయకుడిగా తెలుగులో ఒక సినిమా రూపొందుతోంది. ఆ సినిమాలో కథానాయికగా 'ప్రాచీ తేలన్' ను ఎంపిక చేసుకున్నారు. గతంలో ఈ అమ్మాయి పలు హిందీ సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం మలయాళంలోను ఒక సినిమా చేస్తోంది. తెలుగులో ప్రాచీ తేలన్ కథానాయికగా నటించనున్న సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇక హీరోగా 'అమన్' కూడా ఎంతవరకూ నిలదొక్కుకుంటాడో చూడాలి.       
Go Back to Shorts
prachi telan

More Telugu News