చిదంబరం ప్రధాన నిందితుడిగా మరో చార్జ్ షీట్ నమోదు చేసిన ఈడీ
- ఎయిర్ సెల్-మాక్సీస్ మనీ ల్యాండరింగ్ కేసులో అనుబంధ చార్జ్ షీట్
- చార్జ్ షీట్ లో మొత్తం 9 మంది పేర్లు నమోదు
- ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి ఊరట
ఢిల్లీ హైకోర్టులో చిదంబరానికి ఊరట
ఐఎన్ ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి పి. చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ, ఈడీ అరెస్ట్ పై ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిలు గడువు ముగియడంతో ఈ గడువును మరింత పెంచింది. నవంబర్ 29 వరకు అరెస్ట్ చేయవద్దంటూ చిదంబరానికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఇదిలావుండగా 2007లో యూపీఏ ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేసిన చిదంబరంపై పలు ఆరోపణలు వచ్చాయి. మీడియా మాజీ ప్రముఖుడు పీటర్ ముఖర్జీ, ఇంద్రాణి ముఖర్జీలకు చెందిన ఐఎన్ ఎక్స్ మీడియాకు అనుమతుల జారీ విషయంలో చిదంబరంతోపాటు ఆయన కొడుకు కార్తీ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులపై సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.